శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 13:20:43

జేఈఈ, నీట్‌ విద్యార్థుల కోసం ఎన్‌టీఏ హెల్ప్‌లైన్‌ నంబర్లు

జేఈఈ, నీట్‌ విద్యార్థుల కోసం ఎన్‌టీఏ హెల్ప్‌లైన్‌ నంబర్లు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా దేశంలోని విద్యాసంస్థలు అన్నింటిని మూసివేశారు. దేశంలో ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ, అర్హత పరీక్షలను నిర్వహించే నేషల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కూడా తాత్కాలికంగా మూతపడింది. దీంతో ఎన్‌టీఏ నిర్వహించే వివిధ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.  జేఈఈ మెయిన్‌, నీట్‌-యూజీ, యూజీసీ నీట్‌ వంటి ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థుల సందేహాలను తీర్చడానికి హెల్ప్‌లైన్‌ నంబర్లను ఎన్‌టీఏ విడుదల చేసింది. పరీక్షలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా విద్యార్థులు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు - 8700028512, 8178359845, 9650173668, 9599676953, 8882356803. అయితే ఇవి పరిమిత సమయంలో పనిచేస్తాయని, పూర్తి వివరాలకోసం సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ చూడాలని ఎన్‌టీఏ పేర్కొంది.


logo