బుధవారం 27 మే 2020
National - May 11, 2020 , 08:11:38

నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్స్‌లో ఒక‌రికి క‌రోనా

నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్స్‌లో ఒక‌రికి క‌రోనా

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి మెల్ల‌మెల్ల‌గా భ‌ద్ర‌తాబ‌ల‌గాల్లోని అన్ని విభాగాల‌కు విస్త‌రిస్తున్న‌ది. ఇప్ప‌టికే సెంట్ర‌ల్ రిజ‌ర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌), ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ పోలీస్ (ఐటీబీపీ) త‌దిత‌ర విభాగాల్లో వంద‌ల మందికి సోకిన క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పుడు తాజాగా నేష‌నల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ)లోకి ప్ర‌వేశించింది. ఎన్ఎస్‌జీలో ఒకరికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆ సంస్థ డైరెక్ట‌ర్ ఏకే సింగ్ తెలిపారు. అయితే, అత‌ను ఎన్ఎస్‌జీ ఆస్ప‌త్రిలో ప‌నిచేసే నాన్ కాంబాటెంట్ స‌పోర్ట్ స్టాఫ్ మెంబ‌ర్ అని, దీనివ‌ల్ల ఎన్ఎస్‌జీ ఆప‌రేష‌న్స్‌కు ఎలాంటి ఆటంకం ఉండ‌బోద‌ని సింగ్ చెప్పారు.   

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo