శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 05, 2021 , 15:35:46

శ్మ‌శాన‌వాటిక పైకప్పు కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌లో కాంట్రాక్ట‌ర్ అరెస్టు

శ్మ‌శాన‌వాటిక పైకప్పు కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌లో కాంట్రాక్ట‌ర్ అరెస్టు

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముర‌దాన‌గ‌ర్‌లో శ్మ‌శాన‌వాటిక పైకుప్పు కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌లో 24 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.  అయితే ఆ శ్మ‌శాన‌వాటిక‌ను నిర్మించిన కాంట్రాక్ట‌ర్‌పై నేష‌న‌ల్ సెక్యూర్టీ యాక్ట్ కింద కేసు బుక్ చేయాల‌ని ఇవాళ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణం కూలడం వ‌ల్ల ప్ర‌జా ధ‌నం దుర్వినియోగం అయ్యింద‌ని, కాంట్రాక్ట‌ర్లు, ఇంజినీర్ల నుంచి ఆ మొత్తం వ‌సూల్ చేయాల‌ని సీఎం ఆదేశించారు.  మృతిచెందిన వారి కుటుంబాల‌కు 10 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని, ఇండ్లు లేని వారికి ఇండ్లు క‌ట్టించి ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేశారు.  శ్మ‌శాన‌వాటిక నిర్మించిన కాంట్రాక్ట‌ర్ అజ‌య్ త్యాగిని మీర‌ట్ స‌మీపంలో అరెస్టు చేశారు.  స‌తేదీ గ్రామం వ‌ద్ద ఉన్న గంగా కెనాల్ ద‌గ్గ‌ర అత‌న్ని అద‌పులోకి తీసుకున్నారు.  బిల్డింగ్ టెండ‌ర్ ప్ర‌క్రియ‌లో పాల్గొన్న అధికారుల్ని సోమ‌వారం ఘ‌జియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల‌ను 14 రోజుల పాటు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలోకి పంపారు.  ఆదివారం అంత్య‌క్రియ‌ల స‌మ‌యంలో శ‌శ్మాన‌వాటికి పైక‌ప్పు కూల‌డం వ‌ల్ల 24 మంది చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. 


logo