శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 13, 2021 , 21:41:40

గుట్టుగా ఆఫ్ఘనిస్థాన్‌లో దోవల్‌ పర్యటన

గుట్టుగా ఆఫ్ఘనిస్థాన్‌లో దోవల్‌ పర్యటన

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ దోవల్‌ ఆఫ్ఘనిస్థాన్‌ పర్యటన గుట్టుగా సాగింది. ఆ దేశ రాజధాని కాబుల్‌ను సందర్శించిన ఆయన అధ్యక్షుడు అష్రఫ్ ఘని, ఉపాధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో మంగళవారం సమావేశమయ్యారు. ఆఫ్ఘన్‌ జాతీయ భద్రతా సలహాదారుడు హమదుల్లా మోహిబ్‌ను కూడా కలిశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య, రక్షణ సంబంధ అంశాలపై వారితో చర్చించారు. ఆప్ఘనిస్థాన్‌లో ఓ వైపు తాలిబన్లు మారణ హోమానికి పాల్పడుతున్న తరుణంలో అజిత్‌ దోవల్‌ ఆ దేశాన్ని సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo