శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 26, 2020 , 17:17:18

మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌పై ధ‌ర‌లు ఫిక్స్‌..

మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌పై ధ‌ర‌లు ఫిక్స్‌..

హైద‌రాబాద్‌:  కోవిడ్ వేళ మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను డిమాండ్ పెరిగింది. దీన్ని అదునుగా చేసుకుని కొంద‌రు దందాకు పాల్ప‌డ‌తున్నారు. అధిక ధ‌ర‌ల‌కు మెడిక‌ల్ లిక్విడ్ ఆక్సిజ‌న్‌ను అమ్ముతున్నారు. ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు నేష‌న‌ల్ పార్మాసిటిక‌ల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్‌పీపీఏ) రంగంలోకి దిగింది.  మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల ధ‌ర‌ల‌ను ఎన్‌పీపీఏ ఫిక్స్ చేసింది. ఆరు నెల‌ల పాటు ధ‌ర‌లు స్థిరంగా ఉండ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ఇవాళ పేర్కొన్న‌ది. కోవిడ్ నేప‌థ్యంలో మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌కు నాలుగు రేట్ల డిమాండ్ పెరిగింది.  గ‌తంలో రోజుకు 750 ఎంటీ  ఆక్సిజ‌న్ వినియోగించేవారు. ఇప్పుడు ఆ డిమాండ్ రోజుకు 2800 ఎంటీకి పెరిగింది. ఆక్సిజ‌న్ అందుబాటు, సిలిండ‌ర్ ధ‌ర‌ల అంశం త‌మ ప‌రిశీలిన‌లో ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. అయితే లిక్విడ్ మెడిక‌ల్ ఆక్సిజ‌న్ స్థానిక ధ‌ర‌ను రూ.15.22/CUM, ఆక్సిజ‌న్ గ్యాస్ సిలిండ‌ర్లకు రూ.25.71/CUMగా నిర్ధారించారు. 

   logo