గురువారం 16 జూలై 2020
National - Jun 25, 2020 , 17:16:25

మంత్రుల రాజీనామ‌లు వెన‌క్కి: క‌న్రాడ్‌ సంగ్మా

మంత్రుల రాజీనామ‌లు వెన‌క్కి: క‌న్రాడ్‌ సంగ్మా

ఇంఫాల్‌: మ‌ణిపూర్‌లోరాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కారుకు మ‌ద్దతిస్తున్న నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) ఇటీవ‌ల మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుంది. ప్ర‌భుత్వంలో మంత్రులుగా కొన‌సాగుతున్న న‌లుగురు ఎన్‌పీపీ స‌భ్యులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు. అదే స‌మ‌యంలో అధికార బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసి ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌లో చేరారు. దీంతో మ‌ణిపూర్ స‌ర్కారు సంక్షోభంలో ప‌డింది. 

దీంతో బీరేన్ సింగ్ నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కారు కుప్ప‌కూలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో ఎన్‌పీపీ చీఫ్, మేఘాల‌యా ముఖ్య‌మంత్రి క‌న్రాడ్‌ సంగ్మా గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన త‌మ న‌లుగురు స‌భ్యులు వాటిని ఉప‌సంహిరించుకుంటార‌ని, బీరేన్ సింగ్ ప్ర‌భుత్వానికి వారు మ‌ళ్లీ మ‌ద్ద‌తిస్తార‌ని క‌న్రాడ్ సంగ్మా తెలిపారు.            


logo