మంగళవారం 26 జనవరి 2021
National - Jan 02, 2021 , 19:40:12

భారత సాయుధ దళాలను ఏవీ నిరోధించలేవు: రావత్‌

భారత సాయుధ దళాలను ఏవీ నిరోధించలేవు: రావత్‌

న్యూఢిల్లీ: భారత సాయుధ దళాలను ఏవీ నిరోధించలేవని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. ఆ పదవిని చేపట్టి శుక్రవారం నాటికి ఏడాదైన సందర్భంగా చైనా సరిహద్దు ప్రాంతాలను ఆయన సందర్శించారు. అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో సైనిక సన్నద్ధతను శనివారం పరిశీలించారు. సమర్థవంతమైన నిఘా, మెరుగైన కార్యాచరణ సంసిద్ధతను కొనసాగించడానికి భారత దళాలు అనుసరించిన చర్యలను రావత్‌ ప్రశంసించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పూర్తి నిఘాతో ఉంటడం భారత సాయుధ దళాల గొప్పతనం అని అన్నారు. ఇటువంటి సవాళ్లతో కూడిన పరిస్థితులలో భారత సైనికులు మాత్రమే అప్రమత్తంగా ఉండగలరని కితాబు ఇచ్చారు. దేశ సరిహద్దులను కాపాడటానికి విధి పిలుపు మేరకు బోర్డర్‌కు వెళ్లడానికి సాయుధ దళాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయన్నారు. దీనిని ఏవీ కూడా నిరోధించలేవని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo