మంగళవారం 07 జూలై 2020
National - Jun 16, 2020 , 15:44:21

అమృత్‌సర్‌లో మాస్కు ధరించని వారికి జరిమానా

అమృత్‌సర్‌లో మాస్కు ధరించని వారికి జరిమానా

అమృత్‌సర్‌ : పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ నగరంలో కరోనా విజృంభిస్తున్నందున ఆరోగ్య సంరక్షణ జాగ్రత్తలు పాటించని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు ధరించకుండా రద్దీ ప్రదేశాల్లో సంచరిస్తున్న వారికి మంగళవారం రూ.500 జరిమానా విధించారు. ఉదయం చాలా మంది మాస్కులు ధరించకుండా భౌతికదూరం పాటించకుండా కనిపించారని, పిల్లలు మాస్కులు లేకుండా ఆడుకోవడం కనిపించిందని పోలీసు అధికారి అమర్‌జీత్‌ సింగ్‌ తెలిపారు. మాస్కులు ధరించకుండా మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వారికి రూ.500 జరిమానా విధించామని, నిబంధనలపై స్థానికులకు అవగాహన కల్పించామని ఆయన చెప్పారు. ప్రజలు మాస్కులు ధరించాలని ప్రభుత్వం చెబుతున్నా చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దేశ రాజధానిలో మాస్కులు ధరించకుండా పొగాకు ఉత్పత్తులు నమిలి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ముతున్న వారికి అక్కడి పోలీసులు రూ.500 జరిమానా విధిస్తున్నారు. ఇదే తప్పును పునరావృతం చేస్తే రెట్టింపు జరిమానా విధిస్తున్నారు.logo