గురువారం 02 జూలై 2020
National - Jun 17, 2020 , 17:49:52

మరిన్ని ఘర్షణలు కోరుకోవడంలేదు : చైనా

మరిన్ని ఘర్షణలు కోరుకోవడంలేదు : చైనా

ఛైనా : చైనా-భారత్‌ల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువైపుల ప్రాణనష్టం జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో చైనా విదేశి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆ శాఖ ప్రతినిధి జావో లిజియన్‌ భారత్‌పై తప్పును మోపేందుకు ప్రయత్నించారు. తాము మరిన్ని ఘర్షణలు కోరుకోవడం లేదని, సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నామని తెలిపారు. చైనా వైపు ఉన్న వాస్తవాధిక రేఖ వద్ద ఘర్షణ జరిగిందని, భారత్‌ రెచ్చగొట్టే చర్యలు ఆపేసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలన్నారు.

సరిహద్దు నిబంధనలు, కామాండర్‌ స్థాయి చర్చల్లో కుదిరిన ఏకాభిప్రయాన్ని భారత దళాలు ఉల్లంఘించాయని జిలియస్‌ పేర్కొన్నారు. కాగా సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలో 20 జవాన్లు అమరులైయ్యారని భారత ఆర్మీ ప్రకటించగా.. మరణాల గురించి చైనా మాత్రం నోరువిప్పలేదు. కానీ చైనాకు చెందిన 35 మంది జవాళ్లు మరణించారని అమెరికా ఇంటిలెజెన్స్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


logo