బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 15:30:14

మండలికి పంపనందుకు బాధలేదు

మండలికి పంపనందుకు బాధలేదు

శానసమండలికి తనను పార్టీ అధిష్ఠానం నామినేట్‌ చేయనందుకు ఎలాంటి బాధలేదని స్వర్గీయ బీజేపీ నాయకుడు గోపీనాథ్‌ ముండే తనయ పంకజ ముండే చెప్పారు. శనివారం ఆమె ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పేర్కొంటూ అభిమానులెవరూ నిరుత్సాహపడొద్దని విజ్ఞప్తిచేశారు. గత అసెంబ్లీ  ఎన్నికల్లో పర్లీ నుంచి బరిలోకి దిగిన  పంకజ ముండే.. సోదరుడు ధనంజయ్‌ ముండే చేతిలో పరాజయం పాలయ్యారు. దాంతో గత  కొన్ని రోజులు ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలో జరుగనున్న శాసనమండలికి తన పేరును పార్టీ  అధిష్ఠానం నామినేట్ చేస్తుందని భావించారు. అయితే, పంకజను కాకుండా రంజిత్‌సిన్హ్‌ మొహితే, గోపీచంద్‌ పదాల్కర్‌, ప్రవీన్‌ దత్కే, అజిత్‌ గోప్చాదేలను పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా  బరిలో నిలుపనున్నది. ఇలా ఉండగా, కౌన్సిల్‌లో పార్టీకి ప్రాతినిధ్యం  వహించేందుకు ఆసక్తి చూపిన బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎకనాథ్‌ ఖడ్సే.. తన పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా  పరిశీలనకు తీసుకొనకపోవడంతో తీవ్రంగా  కలత చెందినట్లు ఆయన అభిమానులు చెప్తున్నారు.


logo