బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 16:42:06

నేను ఆరోగ్యంగానే ఉన్నాను: అమిత్‌షా

నేను ఆరోగ్యంగానే ఉన్నాను: అమిత్‌షా

ఢిల్లీ:  తాను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని, తాను ఏ వ్యాధితో బాధ‌ప‌డ‌టం లేద‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా త‌న ఆరోగ్యంపై వ‌స్తున్న పుకార్ల‌కు ట్విట్ట‌ర్ ద్వారా ముగింపు చెప్పారు. గ‌త కొద్ది రోజులుగా నా ఆరోగ్యంపై సోష‌ల్ మీడియాలో పుకార్ల‌ను సృష్టిస్తున్నారు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాన‌ని ట్విట్ చేశారు. త‌న మ‌ర‌ణం కోసం కొంద‌రు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. అలాంటి వారే నా ఆరోగ్యంపై పుకార్లు పుట్టిస్తున్నారని పేర్కొన్నారు. షా ఆరోగ్యంపై కొద్ది రోజులుగా పుకార్లు న‌డుస్తున్నాయి. బ‌రువు త‌గ్గాడ‌ని, ఏదో వ్యాధి  సోకింద‌ని సోష‌ల్ మీడియాలో రూమ‌ర్లు సృష్టించారు. దీనిపై అప్పుడు హోం మంత్రి స్పందించ‌లేదు. దేశం క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారితో పోరాడుతోంది. దేశ హోంమంత్రిగా నేను నా ప‌నిలో బిజీగా ఉన్నాను అలాంటి పుకార్ల‌పై దృష్టి పెట్ట‌లేదని ట్విట్ట‌ర్ ‌లో రాశారు. 


logo