సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 12, 2020 , 12:34:23

రాష్ట్రంలో పాఠ‌శాల‌ల‌ను ఇప్ప‌ట్లో తెరిచేది లేదు

రాష్ట్రంలో పాఠ‌శాల‌ల‌ను ఇప్ప‌ట్లో తెరిచేది లేదు

చెన్నై: ‌రాష్ట్రంలో పాఠ‌శాల‌ల‌ను ఇప్ప‌ట్లో తెరిచేది లేద‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. పాఠ‌శాల‌లు తెర‌వ‌డంపై ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను వెన‌క్కి తీసుకున్న‌ది. ఈనెల 16 నుంచి 9 నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు పాఠ‌శాల‌ల్లో త‌ర‌గ‌తులు, స్కూళ్లలోని హాస్ట‌ళ్ల‌ను ప్రారంభించాల‌ని గ‌తంలో ప్ర‌క‌టించింది. అయితే విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో పాఠ‌శాలల‌ పునఃప్రారంభంపై పున‌రాలోచ‌న‌లో ప‌డింది. ఈ నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌ను ఇప్ప‌ట్లో తెరువ‌బోమ‌ని సీఎం ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి ప్ర‌క‌టించారు. మ‌ళ్లీ స్కూల్స్ ఎప్పుడు తెరుస్తామ‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. త‌ల్లిదండ్రుల నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పాఠ‌శాల‌ల‌ పునఃప్రారంభంపై నిర్ణయం ఉంటుంద‌ని వెల్ల‌డించారు.   


కాగా, చివ‌రి ఏడాది విద్యార్థులు, ప‌రిశోధ‌క విద్యార్థులు త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌వ‌చ్చ‌ని తెలిపారు. వారు హాస్ట‌ళ్ల‌లో ఉండ‌వ‌చ్చ‌ని చెప్పారు. అదేవిధంగా కాలేజీల్లో మొద‌టి ఏడాది విద్యార్థుల‌కు త‌ర‌గతుల ప్రారంభంపై కాలేజీలు, యూనివ‌ర్సిటీల అభిప్రాయాల‌ను కోరారు. కాలేజీలు, హాస్ట‌ళ్ల‌ ప్రారంభంపై యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిషన్ (యూజీసీ) నిబంధ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సూచించారు. వ‌చ్చే నెల 2 నుంచి పీహెచ్‌డీ, ఫైన‌లియ‌ర్ విద్యార్థులు, సైన్స్ అండ్ టెక్నిక‌ల్ కోర్సుల త‌ర‌గ‌తుల‌ను ప్రారంభించ‌వ‌చ్చ‌ని తెలిపారు