ఆదివారం 17 జనవరి 2021
National - Dec 27, 2020 , 18:19:34

నాకు అంత టైమ్ లేదు.. ఆస‌క్తి అస‌లే లేదు: ప‌వార్‌

నాకు అంత టైమ్ లేదు.. ఆస‌క్తి అస‌లే లేదు: ప‌వార్‌

న్యూఢిల్లీ: యూపీఏ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌విని తాను చేప‌ట్ట‌బోతున్నట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించారు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌. నాకు అంత టైమ్ లేదు.. ఆస‌క్తి అస‌లే లేదు. అలాంటి ప్ర‌తిపాద‌న‌కు అవ‌కాశ‌మే లేదు అని ప‌వార్ స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ నుంచి యూపీఏ ప‌గ్గాలు ప‌వార్ తీసుకోనున్న‌ట్లు కొంత కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ ప‌వార్ ఈ ప‌ద‌విని స్వీక‌రిస్తానంటే మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి త‌మకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని శివ‌సేన కూడా ప్ర‌క‌టించింది. అయితే ఈ వార్త‌ల‌ను గ‌తంలో ఎన్సీపీ కూడా ఖండించింది. ఇలాంటి ప్ర‌తిపాద‌న ఏదీ యూపీఏలోని పార్టీల మ‌ధ్య చర్చ‌కు రాలేద‌ని ఎన్సీపీ స్ప‌ష్టం చేసింది.