బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 14:04:26

లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయ‌డం లేదు : సీఎం ఉద్ధవ్ థాకరే

లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయ‌డం లేదు : సీఎం ఉద్ధవ్ థాకరే

ముంబై : రాష్ర్టంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను ఎత్తేసేందుకు అనుకూలంగా లేమ‌ని మ‌హారాష్ర్ట ముఖ్య‌మంత్రి ఉద్ధవ్ థాకరే తెలిపారు. కాగా కోవిడ్‌-19 సంక్షోభంలో ఒక‌ప‌క్క ఆరోగ్యం, మ‌రొప‌క్క రాష్ర్ట ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య స‌మ‌తుల్య‌త సాధించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేస్తున్న‌ట్లు తానెప్ప‌టికీ చెప్ప‌న‌న్నారు. కానీ కొన్ని రంగాల‌ను క్ర‌మంగా తిరిగి తెరిచేందుకు చ‌ర్య‌లు ప్రారంభించిన‌ట్లు చెప్పారు. అయితే ఒక‌సారి వీటిని తిరిగి తెరిస్తే మ‌ళ్లీ మూసివేయ‌డ‌మంటూ ఉండ‌కూడ‌ద‌న్నారు. ఇందుకోసం ద‌శ‌ల‌వారీగా అడుగులు వేస్తున్న‌ట్లు తెలిపారు. 

ఆర్థిక ప్ర‌యోజ‌నాలా? ఆరోగ్య ప్ర‌యోజ‌నాలా? అని ఏదో ఒక‌దానివైపే ఆలోచించొద్ద‌న్నారు. రెండింటి మ‌ధ్య స‌మ‌తుల్య‌త ఉండాలని శివసేన మౌత్ పీస్ సామ్నాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న‌ పేర్కొన్నారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్ జూలై 31 వరకు కొనసాగుతుందన్నారు. మిష‌న్ బిగిన్ ఎగైన్ కింద ద‌శ‌ల‌వారీగా ఆంక్ష‌ల‌ను స‌డ‌లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చ‌ర్య‌లు ప్రారంభించింద‌న్నారు. 

కోవిడ్‌-19 ప్ర‌పంచం మొత్తాన్ని ప్ర‌భావితం చేసింది. క‌రోనా వైర‌స్‌పై ప్ర‌పంచం యుద్ధం చేస్తుంద‌ని థాకరే అన్నారు. క‌రోనా అంత‌మైంద‌ని భావించి లాక్‌డౌన్‌ను ఎత్తేసిన దేశాలు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాయి. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి తిరిగి లాక్‌డౌన్ విధించే దిశ‌గా ప‌య‌నిస్తున్నాయ‌న్నారు. 

లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తున్న వారిని థాకరే ఎత్తిచూపారు. లాక్‌డౌన్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అలాంటివారికి వారికి తాను ఒక్క‌టే చెప్ప‌ద‌ల‌చుకున్నా. లాక్‌డౌన్ ఎత్తేయ‌డానికి తాను సిద్ధంగా ఉన్నానని. కాని దాని వ‌ల్ల ప్రజలు మరణిస్తే వారు బాధ్యత తీసుకుంటారా? అని ప్ర‌శ్నించారు. ఆర్థిక వ్యవస్థ గురించి కూడా తాము ఆందోళన చెందుతున్న‌ట్లు పేర్కొన్నారు. 


logo