బుధవారం 20 జనవరి 2021
National - Dec 25, 2020 , 12:08:26

అంగుళం భూమి కూడా లాక్కోలేరు: ల‌ఢ‌ఖ్ ఎంపీ

అంగుళం భూమి కూడా లాక్కోలేరు: ల‌ఢ‌ఖ్ ఎంపీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఉండి.. రాజ్‌నాథ్ సింగ్ ర‌క్ష‌ణ మంత్రిగా కొన‌సాగినంత‌కాలం దేశ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ల‌ఢ‌ఖ్ ఎంపీ జ‌మ్యాంగ్ త్సెరింగ్ నంగ్యాల్ పేర్కొన్నారు. స‌రిహ‌ద్దుల్లో పొరుగు దేశాల దురాక్ర‌మణ‌కు అవ‌కాశం లేకుండా కేంద్ర ప్ర‌భుత్వం ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని, అందువ‌ల్ల పొరుగు దేశాలు ల‌ఢ‌ఖ్ నుంచి గానీ, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ నుంచి గానీ ఒక అంగుళం భూమి కూడా లాక్కోలేవ‌ని ఆయ‌న చెప్పారు. ల‌ఢ‌ఖ్‌ స‌రిహ‌ద్దుల్లో కొంత ప్ర‌దేశాన్ని బ‌ఫ‌ర్ జోన్‌గా వ‌దిలేద్దామంటూ చైనా ఆర్మీ చేసిన ప్ర‌తిపాద‌న‌ను కేంద్రం తిర‌స్క‌రించింద‌ని ఎంపీ నంగ్యాల్ తెలిపారు. ల‌ఢ‌ఖ్ వాసిగా, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ప్ర‌తినిధిగా పొరుగుదేశాలు ఆడిన ఎన్నో డ్రామాల‌కు తాను ప్ర‌త్య‌క్ష‌సాక్షిగా ఉన్నాన‌ని ఆయ‌న చెప్పారు. ల‌ఢ‌ఖ్ ప్ర‌జ‌లు ఎప్పుడూ అభ‌ద్ర‌త‌తో ఉండేవార‌ని, కానీ మొద‌టిసారిగా మోదీ హ‌యాంలో వారు సుర‌క్షితంగా ఉన్నార‌ని నంగ్యాల్ వెల్ల‌డించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ప్రజల ముందుకు చంద్రయాన్‌-2 సమాచారం

పార్టీని ప్రారంభించనున్న అళగిరి?

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo