గురువారం 04 జూన్ 2020
National - Jan 08, 2020 , 11:44:51

ఆలయంలోకి అనుమతించలేదు

ఆలయంలోకి అనుమతించలేదు

సిమ్లా: దళితులమైనందునే తనతోపాటు ఓ ఎమ్మెల్యేని రాష్ట్రంలోని ఓ ఆలయంలోకి అనుమతించలేదని హిమాచల్‌ప్రదేశ్‌ మంత్రి రాజీవ్‌ సైజల్‌ వాపోయారు. లోక్‌సభ, రా ష్ర్టాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ సభ్యుల రిజర్వేషన్‌ను పదేండ్లు పొడిగిస్తూ ఇటీవల కేంద్రం తెచ్చిన (రాజ్యాంగ సవరణ) బిల్లుపై మంగళవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రి రాజీవ్‌ సైజల్‌ తన ఆవేదన తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ఆలయాల్లో దళితులకు ప్రవేశం కల్పించడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగత్‌ సింగ్‌ నెగి పేర్కొన్న నేపథ్యం లో ఆయన మాట్లాడారు. మంత్రినైన తనకూ ఇలాంటి అనుభవం ఎదురైందన్నారు. ఎమ్మె ల్యే వినోద్‌ కుమార్‌తో కలిసి ఓ ఆలయం సందర్శనకు వెళ్లినప్పుడు తమను లోనికి అనుమతించలేదన్నారు. అది ఏ ఆలయం, ఎక్కడ ఉంది, ఇది ఎప్పుడు జరిగిందో ప్రస్తావించలేదు. అనంతరం పార్లమెంట్‌ ఆమోదం పొందిన రాజ్యాంగ (126వ) సవరణ బిల్లును హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని కోసం మంగళవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశంకాగా తొలుత గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సభనుద్దేశించి ప్రసంగించారు.


logo