గురువారం 02 జూలై 2020
National - Jun 29, 2020 , 17:43:41

మర్మగోవా పోర్ట్‌కు చేరుకున్న నార్వేయన్‌ ఎస్కేప్‌

మర్మగోవా పోర్ట్‌కు చేరుకున్న నార్వేయన్‌ ఎస్కేప్‌

పనాజీ: కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం వాయుమార్గంతోపాటు సముద్రమార్గాన్ని కూడా వినియోగించుకుంటున్నది. ఫ్లోరిడాలోని మయామి నుంచి 474 మంది నావికులను నార్వేజియన్‌ క్రూయిజ్‌ లైన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న నార్వేజియన్‌ ఎస్కేప్‌ అనే క్రూయిజ్‌ షిప్‌ ద్వారా స్వదేశానికి తీసుకువచ్చింది. నార్వేజియన్‌ ఎస్కేప్‌ సోమవారం తెల్లవారుజామున గోవాలోని మర్మగోవా పోర్డుకు చేరుకుంది. ఈ ఓడ శనివారం సూయజ్‌ కాలువను దాటి నేడు గోవాకు వచ్చింది. ఇక్కడి నుంచి ఓడ ముంబై వెళ్లనుంది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి వల్ల ప్రయాణికులకు విమాన ప్రయాణాన్ని పరిమితం చేశారు. దీంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయ పౌరులు స్వదేశానికి రావడానికి ఇబ్బందిపడుతున్నారు. దీంతో భారత ప్రభుత్వం సముద్రం లేదా విమాన ప్రయాణ మార్గాల ద్వారా, అన్ని దేశాల నుంచి ఇండియన్స్‌ను స్వదేశానికి రప్పించేందుకు చొరవ తీసుకుంటున్నది. ఇప్పటికే వందేభారత్‌ మిషన్‌ మూడో ఫేస్‌ ముగిసింది. జూలై 3నుంచి నాలుగో ఫేస్‌ ప్రారంభం కానుంది. దీంతోపాటు భారత సర్కారు పలు దేశాలనుంచి క్రూయిజ్‌ షిప్‌ల ద్వారా కూడా భారతీయులను ఇక్కడికి క్షేమంగా తీసుకువస్తున్నది. logo