మంగళవారం 07 జూలై 2020
National - Jun 28, 2020 , 16:37:50

ఈశాన్య రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌

ఈశాన్య రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌

న్యూఢిల్లీ: నైరుతి రుతుప‌వ‌నాలు దేశ‌మంత‌టా విస్త‌రించాయి. ఈ రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో ప్ర‌స్తుతం ఉత్త‌రాది రాష్ట్రాల‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వాన‌లు ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాగ‌ల రెండు రోజులు బీహార్‌, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని న్యూఢిల్లీలో భార‌త వాతావ‌ర‌ణ కేంద్రానికి చెందిన శాస్త్ర‌వేత్త న‌రేష్ కుమార్ తెలిపారు. అయితే రానున్న ఐదురోజుల‌పాటు పంజాబ్‌, హ‌ర్యానా, ఢిల్లీల్లో చెదురుమొదురు జ‌ల్లులు మిన‌హా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం లేద‌ని ఆయ‌న చెప్పారు. అదేవిధంగా రానున్న కొద్ది రోజుల‌పాటు మ‌ధ్య భార‌త‌దేశంలో సాధార‌ణ వ‌ర్షపాతం న‌మోద‌వుతుంద‌ని శాస్త్ర‌వేత్త న‌రేష్ కుమార్ తెలిపారు.  


logo