బుధవారం 27 మే 2020
National - May 16, 2020 , 15:17:28

ఇతర ప్రాంతాల కంటే ఈశాన్య రాష్ర్టాలు మెరుగు

ఇతర ప్రాంతాల కంటే ఈశాన్య రాష్ర్టాలు మెరుగు

ఢిల్లీ : కోవిడ్‌-19ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దేశంలోని ఇతర రాష్ర్టాల కంటే ఈశాన్య రాష్ర్టాలు చాలా మెరుగ్గా ఉన్నాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. కోవిడ్‌-19పై అన్ని ఈశాన్య రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మంత్రి నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. కోవిడ్‌-19ను ఎదుర్కోవడంలో ఈశాన్య రాష్ర్టాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు.logo