మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 17:21:01

బెంగాల్‌, సిక్కింకు భారీ వర్ష సూచన

బెంగాల్‌, సిక్కింకు భారీ వర్ష సూచన

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్, సిక్కింతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోని ఉత్తర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. దీంతో జూలై 12 నుంచి 16 వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కోల్ కతాలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తన తాజా బులెటిన్‌లో పేర్కొంది. హిమాలయ పర్వతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించడం, బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన తేమ కారణంగా వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. భారీ వర్షాల ప్రభావంతో కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడవచ్చని, లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కూడా బులెటిన్‌లో హెచ్చరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo