మంగళవారం 04 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 14:14:59

ఇతరుల పేరుతో.. సుశాంత్ వాడిన సిమ్ కార్డులు

ఇతరుల పేరుతో.. సుశాంత్ వాడిన సిమ్ కార్డులు

పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వాడిన మొబైల్ సిమ్ కార్డులు ఆయన పేరుతో నమోదు కాలేదని బీహార్ పోలీసులు తెలిపారు. ఒక సిమ్ ఆయన స్నేహితుడు సిద్ధార్థ్ పిథాని పేరుతో ఉందని చెప్పారు. సుశాంత్ వినియోగించిన మొబైల్స్ కాల్ డేటా రికార్డులను సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు బీహార్ పోలీసులు వివరించారు. సుశాంత్ ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు చనిపోయిన మాజీ మేనేజర్ దిషా శాలియన్ కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తునట్లు చెప్పారు. ఫోన్ ద్వారా వారిని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందించడం లేదని బీహార్ పోలీసులు తెలిపారు.

సుశాంత్ తల్లిదండ్రులు తమ కుమారుడి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో బీహార్ పోలీసులు కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. దీని కోసం కొందరు పోలీసులు ముంబై వెళ్లారు. అయితే ముంబై పోలీసులు తమకు సహకరించడం లేదని బీహార్ పోలీసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బీహార్ పోలీసు బృందానికి పాట్నా (సెంట్రల్) పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) వినయ్ తివారీ నాయకత్వం వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముంబైకి బయలుదేరారు.



logo