మంగళవారం 14 జూలై 2020
National - Jul 01, 2020 , 11:34:34

మళ్లీ పెరిగిన నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర

మళ్లీ పెరిగిన నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర

న్యూఢిల్లీ: సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్‌ ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలో అత్యధికంగా వంటగ్యాస్‌ సిలండర్లను పంపిణీ చేసే ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ ప్రకారం.. దేశంలోని మెట్రోపాలిటన్‌ నగరాల్లో 14.2 కిలోల నాన్‌ సబ్సిడీ సిలిండర్‌పై రూ.1 నుంచి రూ.4.50 వరకు పెరిగింది. దీంతో నెల రోజుల వ్యవధిలో రెండోసారి ఎల్పీజీ సిలిండర్ల ధర పెరిగినట్లయ్యింది. ఈ పెంపుతో ఢిల్లీలో నాన్‌ సిబ్సిడీ లిండర్‌ ధర రూ.594కు చేరింది. చెన్నైలో రూ.4లు, కోల్‌కతాలో రూ.4.50, ముంబైలో రూ.3.50 చొప్పున పెరిగాయి.     

కేంద్ర ప్రభుత్వం గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిండర్లలో ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీపై అందిస్తుంది. ఈ కోటా ముగిసిన తర్వాత నాన్‌ సబ్సిడీ సిలిండర్లను కొనుగోలు చేయాల్సిందే. కాగా, ముడి చమురు ధరలు, ఫారెన్‌ ఎక్సేంజ్‌కు అనుగుణంగా ఎల్పీజీ సిలిండర్‌ ధరలను కంపెనీలు పెంచుతున్నాయి.


logo