ఆదివారం 29 మార్చి 2020
National - Feb 14, 2020 , 17:41:53

బ‌ర్త్‌డే, ప్రీ-వెడ్డింగ్ సంబ‌రాల‌కు.. మెట్రో రైలు బుక్ చేసుకోండి

బ‌ర్త్‌డే, ప్రీ-వెడ్డింగ్ సంబ‌రాల‌కు.. మెట్రో రైలు బుక్ చేసుకోండి

హైద‌రాబాద్‌:  ఢిల్లీలోని నోయిడా మెట్రో రైలు సంస్థ ..  ఇప్పుడు సంబ‌రాల‌కు అడ్డ‌గా మార‌నున్న‌ది.  ప్ర‌యాణికులు ఎవ‌రైనా ఓ కోచ్‌ను కానీ మొత్తం మెట్రో రైలు(4బోగీలు)ను కానీ .. ఏదైనా పార్టీ కోసం కావాలంటే బుక్ చేసుకోవ‌చ్చు.  దీని కోసం గంట‌కు 5 వేల నుంచి 10వేల వ‌ర‌కు వ‌సూల్ చేయ‌నున్నారు.  ప‌ర్స‌న‌ల్‌గా ఎవ‌రైనా సెల‌బ్రేట్ చేసుకోవాలంటే.. ఇక నుంచి మెట్రో రైలును వాడుకోవ‌చ్చు అంటూ నోయిడా మెట్రో రైలు సంస్థ పేర్కొన్న‌ది.  మెట్రో సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు, మ‌రింత ఉత్త‌మ సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మెట్రో ఎండీ రీతూ మ‌హేశ్వ‌రి తెలిపారు. 30 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు ఉన్న నోయిడా మెట్రో కారిడార్‌లో మొత్తం 21 స్టేష‌న్లు ఉన్నాయి. నోయిడా సెక్ట‌ర్ 51 నుంచి గ్రేట‌ర్ నోయిడా వ‌ర‌కు రైలు వెళ్తుంది. అయితే పార్టీ కోసం మెట్రోను 15 రోజుల ముందుగా బుక్ చేసుకోవాలి.  ఒక కోచ్‌కు ఒక సెంట‌ర్ టేబుల్‌ను ఏర్పాటు చేస్తారు. హౌజ్‌కీపింగ్ స్టాఫ్ కూడా ఉంటుంది. సెక్యూర్టీ డిపాజిట్‌గా 20 వేలు క‌ట్టాలి. logo