శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 05, 2021 , 15:51:22

కొవిడ్ నిబంధ‌న‌ల ధిక్క‌ర‌ణ‌.. సెల‌బ్రిటీల‌కు మంత్రి వార్నింగ్‌

కొవిడ్ నిబంధ‌న‌ల ధిక్క‌ర‌ణ‌.. సెల‌బ్రిటీల‌కు మంత్రి వార్నింగ్‌

ముంబై : కొవిడ్‌ నిబంధనలను అతిక్రమించిన కారణంగా ముంబై పోలీసులు బాలీవుడ్‌ నటులు అర్బాజ్‌ ఖాన్‌, సోహైల్‌ ఖాన్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సంగ‌తి తెలిసిందే.. దీనిపై మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపే మంగళవారం స్పందిస్తూ.. చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. ప్రతీఒక్కరూ నిబంధనలు పాటించాల‌ని తెలిపారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఆదర్శ పౌరులుగా ప్రస్తుత మహమ్మారి సమయంలో నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

ఇనిస్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ నిబంధనలు అతిక్రమించిన కారణంగా గడిచిన సోమవారం నాడు పోలీసులు అర్బాజ్‌ ఖాన్‌, అతని సోదరుడు సోహైల్‌ ఖాన్‌, కుమారుడు నిర్వాణ్‌ ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గత నెలలో యూఏఈ నుంచి ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత వీరిని సుబర్బన్‌ బాంద్రా హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. కాగా వీరు పట్టించుకోకుండా వాళ్ల ఇంటికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

దీంతో ఈ ముగ్గురి వ్యక్తులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 188(ప్రభుత్వ అధికారుల ఆదేశాలను ధిక్కరించడం), 269(వ్యాధి వ్యాప్తి జరిగేలా నిర్లక్షపూరిత వైఖరి), అదేవిధంగా ఎపిడమిక్‌ డీసీజ్‌ యాక్ట్‌ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కొత్త కరోనా స్ట్రెయిన్‌ వెలుగుచూసిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం యూరోప్‌, మిడిల్‌ ఈస్ట్‌ నుంచి దేశానికి వచ్చిన వారు తప్పనిసరిగా ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి.


logo