మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 04, 2020 , 13:44:11

చ‌ట్టానికి ఎవరూ అతీతులు కాదు!

చ‌ట్టానికి ఎవరూ అతీతులు కాదు!

ముంబై: చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కార‌ని, చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుపోతుంద‌ని మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. మ‌హారాష్ట్ర పోలీసులు చ‌ట్ట ప్ర‌కారం త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతార‌ని ఆయన చెప్పారు. ఈ ఉద‌యం రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ ఆర్న‌బ్ గోస్వామి అరెస్ట‌య్యారు. రెండేండ్ల క్రితం 53 ఏండ్ల ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌పై అనిల్ దేశ్‌ముఖ్ స్పందిస్తూ.. పై వ్యాఖ్య‌లు చేశారు. 

కేసును పునఃప్రారంభించాల‌ని మృతుడి భార్య కోర్టును ఆశ్ర‌యించ‌డంతో కోర్టు అందుకు అనుమ‌తిచ్చింద‌ని అనిల్‌దేశ్‌ముఖ్ చెప్పారు. త‌న భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌కు రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్ ఆర్న‌బ్ గోస్వామి కార‌ణ‌మ‌ని మృతుడి భార్య అనుమానిస్తున్నార‌ని, ఆ మేర‌కే ఆమె కేసును తిరిగి ఓపెన్ చేయాల‌ని కోర్టును కోరార‌ని ఆయ‌న తెలిపారు.  ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.