సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 11:08:35

పేద‌ల‌కు నోబుల్‌ అసోసియేష‌న్ సాయం

పేద‌ల‌కు నోబుల్‌ అసోసియేష‌న్ సాయం

రెక్క ఆడందే డొక్క ఆడ‌ని పేద ప్ర‌జ‌లు క‌రోనా ప్ర‌భావంతో ఇండ్ల‌లోనే ఉండాల్సిన ప‌రిస్థితి. నోబుల్‌ అసోసియేష‌న్ వారు భార‌త్‌లోని వివిధ రాష్ట్రాల‌ ప్ర‌జ‌ల‌కు ఈ విధంగా సాయ ప‌డుతున్నారు. వీరంతా ఈ ప‌నికి పూనుకోవ‌డానికి కార‌ణం ప్ర‌దాన‌మంత్రి నిర్ణ‌యించిన 21 రోజుల లాక్‌డైనే కార‌ణం. క‌రోనా వైర‌స్ మొద‌లైన‌ప్ప‌టి  నుంచి పేద ప్ర‌జ‌ల‌కు మాత్రం అన్నీ క‌ష్టాలే. ఇరుకు ఇంట్లో ఉండ‌లేక బ‌య‌ట‌కు రాలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అలాంటి వారికి నోబుల్ అసోసియేష‌న్ అండ‌గా నిలుస్తున్న‌ది. 

డార్జిలింగ్‌

ఇక్క‌డ ఐకానిక్ బేక‌రి చాలా ఫేమ‌స్‌. దీనికి త‌రచుగా వేల‌ల్లో క‌స్ట‌మ‌ర్లు వ‌స్తుంటారు. వారే దేవ‌ళ్లుగా భావిస్తారు బేక‌రి య‌జ‌మానులు. ఇప్ప‌డు క‌స్ట‌మ‌ర్లు క‌ష్టాల్లో ఉన్నారు. అందుకే బేక‌రి నుంచి మార్చి 23న అక్క‌డి పేద ప్ర‌జ‌ల‌కు ఉచితంగా బ్రెడ్ డొనేట్ చేశారు. 

క‌శ్మీర్‌

క‌శ్మీర్‌లోని బుక్స్ స్టోర్ ఇన్ ద వ్యాలీ త‌రుపున పేద ప్ర‌జ‌ల‌కు వెయ్యి పుస్త‌కాలు విరాళంగా ఇచ్చారు. క‌ట్టుక‌థ‌లు, పురాణాలు, రాజ‌కీయాలు, నీతి క‌థ‌లు లాంటి పుస్త‌కాలు ఇచ్చారు. క‌రోనా ప్ర‌భావంతో పిల్ల‌లంద‌రూ ఇంట్లోనే గ‌డుపుతున్నారు. వారి ఈ స‌మ‌యాన్ని వ‌దులుకోకుండా పుస్త‌కాల‌తో జ్ఞానం సంపాదించుకోవ‌చ్చు అన్న బావంతో పిల్ల‌ల‌కు అంద‌జేస్తున్నారు.


పాట్నా

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ త‌ర‌చుగా చేతులు క‌డుక్కోవాలి. శుభ్రంగా ఉండాలి అని చెబుతున్నారు. అందుచేత జ‌న‌తా క‌ర్ఫ్యూ రోజున పోలీసులు ఉద్యోగ భాగంలో బ‌య‌టే ఉండాల్సి వ‌చ్చింది. ఆరోజు వారి బాధ్య‌త‌ను తెలుసుకున్న పాట్న నివాసి శానిటైస‌ర్లు అంద‌జేశాడు.

ఢిల్లీ

రోడ్లు శుభ్రంగా ఉంటేనే న‌గ‌రం ఆరోగ్యంగా ఉంటుంది. వాటిని శుభ్రంగా ఉంచేందుకు వంద‌ల మంది కార్మీకులు ప‌నిలో ఉన్నారు. వారికి స‌హాయంగా ఢిల్లీలోని సాఫ్ట‌ర్‌జంగ్ ఎన‌క్లేవ్ వారు టీ, కాఫీ లాంటి పానీయాల‌ను అందించారు. అంతేకాకుండా క‌ర‌న్‌నాగి, ఆరుషి వేరే ప్ర‌దేశాల‌కు కూడా టీ అందించారు.

పంజాబ్‌

పంజాబ్‌లోని పోలీస్ ఆఫీస‌ర్ మార్కెట్‌కి వెళ్లాడు. అక్క‌డున్న కూర‌గాయ‌లు కొన్నాడు. వాటిని తీసుకెళ్ళి రెసెడెన్సీ వాళ్ళ‌కు పంచాడు. దీన్ని వీడియో తీసి ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రింద‌ర్ సింగ్ ట్విట‌ర్‌ల‌లో శ‌భాష్ అంటూ పోస్ట్ చేశాడు. 


logo