సోమవారం 25 మే 2020
National - Apr 08, 2020 , 07:20:12

హిందూ మహిళ పాడే మోసిన ముస్లిం యువకులు

హిందూ మహిళ పాడే మోసిన ముస్లిం యువకులు

భోపాల్‌ : ఓ హిందూ మహిళ పాడేను ముస్లిం యువకులు మోసి మత సామరస్యాన్ని చాటారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఇండోర్‌కు చెందిన 65 ఏళ్ల మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె సోమవారం మృతి చెందింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆమె ఇద్దరు కుమారులు మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో బంధువులు, స్థానికులు ఎవరూ కూడా అంత్యక్రియలకు రావడానికి సాహసం చేయలేదు. దీంతో స్థానికంగా ఉన్న ముస్లిం యువకులు ఆ మహిళ మృతదేహాన్ని శ్మశానవాటికకు మోసుకెళ్లారు. సుమారు 2.5 కిలోమీటర్లు ముస్లిం యువకులే పాడేను మోసి మత సామరస్యాన్ని చాటారు. హిందూ మహిళ పాడే మోసిన ముస్లిం యువకులపై మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ ప్రశంసలు కురిపించారు. 


logo