సోమవారం 01 జూన్ 2020
National - May 18, 2020 , 16:37:00

బంగారు సీతాకోక చిలుకలు‌!

బంగారు సీతాకోక చిలుకలు‌!

ముందు కింద వీడియోను చూడండి.. శంఖం ఆకారంలో ఉన్న నిగనిగలాడే చిన్నచిన్న గోళీలు ఎంత మద్దొస్తున్నాయో కదూ... అచ్చం బంగారంతో చేసినవాటిలాగే ఉన్నాయి కదూ.. ఇవి సీతాకోక‌చిలుక ప్యూపాలు. 

ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్‌కు చెందిన ప‌ర్వీన్ క‌స్వాన్ ఎనిమిది సెకండ్ల వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేశారు. కొన్ని గంట‌ల్లోనే వేల మంది వీక్షించారు. 'ఆడ‌పురుగు మొక్క‌ల‌ ఆకులపై గుడ్లు పెట్టిన త‌ర్వాత వాతావ‌ర‌ణం వెచ్చ‌గా మారినపుడు గుడ్లు పొద‌గ‌డం ప్రారంభ‌మ‌వుతాయి. గుడ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పురుగులు ప్యూపాలా ఏర్ప‌డుతాయి'. అవి సీతాకోక చిలుక‌లుగా ప‌రివ‌ర్త‌న చెందుతాయి.  ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. logo