గురువారం 16 జూలై 2020
National - Jun 24, 2020 , 17:39:48

పాములా క‌నిపిస్తున్న జీవి పాము కాదు.. మ‌రి ఇంకేంటి?

పాములా క‌నిపిస్తున్న జీవి పాము కాదు.. మ‌రి ఇంకేంటి?

క‌ళ్ల‌కు క‌నిపించేవ‌న్నీ నిజాలు కావు. ఫొటోలో క‌నిపిస్తున్న జీవిని చూడ‌గానే ప్ర‌తి ఒక్క‌రూ పాము అని డిసైడ్ అయిపోతున్నారు. వీడియో చూస్తే గాని అస‌లు నిజం బ‌య‌ట ప‌డ‌దు. అయినా.. ఏం ప్ర‌యోజ‌నం ఈ జీవి పేరేంటో ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌లేక‌పోతున్నారు. దానిలా ఉంది, దీనిలా ఉంది అంటున్నారే గాని ఎవ‌రూ క‌రెక్ట్ పేరు చెప్ప‌లేక‌పోతున్నారు. ఆ జీవి ఏంటో మీరు కూడా చూడాల‌నుకుంటున్నారా?

మొద‌ట కాళ్ల‌ను చూస్తే అచ్చం పాములానే అనిపించింది క‌దూ.. త‌ర్వాత అర్థ‌మ‌వుతుంది అది సాలీడు పురుగులా ఉండే జీవి అని. దీనికి మొత్తం ఐదు కాళ్లు ఉన్నాయి. పాము పాకిన‌ట్లుగానే పాకుతున్న‌ది. దీన్ని చూస్తుంటే నేల‌పైన‌, నీటిలో కూడా జీవించేలా క‌నిపిస్తుంది. ఈ వీడియోను లేడియా ర్యాలే అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిని సుమారు 3 ల‌క్ష‌ల మంది వీక్షించ‌డం గ‌మ‌నార్హం. వీడియో చూసిన త‌ర్వాత జీవి పేరును ప‌లుర‌కాలుగా నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 
logo