గురువారం 09 జూలై 2020
National - Jun 26, 2020 , 15:23:33

మ‌రోసారి లాక్‌డౌన్ ప్ర‌స‌క్తే లేదు: క‌ర్ణాట‌క సీఎం

మ‌రోసారి లాక్‌డౌన్ ప్ర‌స‌క్తే లేదు: క‌ర్ణాట‌క సీఎం

బెంగ‌ళూరు: బెంగ‌ళూరులో మ‌రోసారి లాక్‌డౌన్ విధించే ప్ర‌స‌క్తే లేద‌ని క‌ర్ణాట‌క‌ ముఖ్య‌మంత్రి యెడియూర‌ప్ప‌ స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. బెంగ‌ళూరులో ఇప్ప‌టికే ప‌లు స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల‌ను సీల్ చేసినందున ప్ర‌త్యేకంగా న‌గ‌రం అంత‌టా లాక్‌డౌన్ విధించాల్సిన అవ‌స‌రం లేద‌ని సీఎం భావిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. 

బెంగ‌ళూరులో క‌రోనా ప‌రిస్థితిపై స‌మీక్షించేందుకు క‌ర్ణాట‌క సీఎం యెడియూర‌ప్ప ఈ ఉద‌యం రాష్ట్ర మంత్రులు, న‌గ‌రానికి చెందిన ఎమ్మెల్యేల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌తి ఎమ్మెల్యే, మంత్రి ఎవ‌రికి వారు త‌మ‌ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఈ సంద‌ర్భంగా యెడియూర‌ప్ప సూచించారు. క‌రోనా బాధితులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌ను ఇప్ప‌టికే సీల్ చేశామ‌ని, కొత్తగా లాక్‌డౌన్ అసస‌రం లేదని వారు అభిప్రాయ‌ప‌డ్డారు. 

కాగా, మ‌‌రోసారి లాక్‌డౌన్ వ‌ద్ద‌నుకుంటే క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డిలో ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి యెడియూర‌ప్ప గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు. అంద‌రూ విధిగా ముఖాల‌కు మాస్కులు ధ‌రించాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని కోరారు. ఆ ప్ర‌క‌ట‌న చేసిన మ‌రుస‌టి రోజే బెంగ‌ళూరులో మ‌రోసారి లాక్‌డౌన్ విధించోమ‌ని యెడియూర‌ప్ప ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.      ‌


logo