బుధవారం 27 మే 2020
National - May 11, 2020 , 17:08:27

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు త‌గ్గించే ప్ర‌తిపాద‌న లేదు..

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు త‌గ్గించే ప్ర‌తిపాద‌న లేదు..

న్యూఢిల్లీ:  కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు త‌గ్గించే ప్ర‌తిపాద‌న లేద‌ని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. వార్తా క‌థ‌నాల‌పై స్పందింస్తూ తాము ఏ స్థాయి ఉద్యోగుల జీతాలు క‌ట్ చేయ‌డం లేద‌ని పేర్కొంది. మీడియాలో వ‌చ్చే వార్త‌కు తాము బాధ్యులం కామ‌ని పేర్కొంది. క‌రోనా వైర‌స్ మ‌హమ్మారిపై పోర‌డ‌టానికి, ప్ర‌జ‌ల అవ‌స‌రాలు కోసం 2021 జూన్ 30వ తేదీ వ‌ర‌కు 50 ల‌క్ష‌ల మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు, 61 ల‌క్ష‌ల మంది పెన్ష‌న‌ర్ల‌కు పెరిగిన డియ‌ర్‌నెస్ అల‌వెన్స్ చెల్లింపులు గ‌త నెల‌లో నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. 2020 జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి 2021 జూన్ 30వ తేదీ వ‌ర‌కు డీఏ బ‌కాయిలు చెల్లించ‌వ‌ద్ద‌ని ఆర్థిక శాఖ ఇంత‌కు ముందే మెమోరాండం ఇచ్చింది. 


logo