సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 11:39:00

టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయ‌డం లేదు: కేంద్ర మంత్రి

టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయ‌డం లేదు: కేంద్ర మంత్రి

హైద‌రాబాద్‌: టిక్‌టాక్ యాప్‌కు జ‌నాల్లో ఎంత క్రేజ్ ఉందో అంద‌రికీ తెలిసిందే. స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు ఆ యాప్‌తోనే ఎక్కువ టైంపాస్ చేస్తున్నారు. అయితే ఆ యాప్‌పై ఇటీవ‌ల కొన్ని పుకార్లు వ‌చ్చాయి.  దీంతో ఆ యాప్‌ను బ్యాన్ చేస్తారేమో అన్న అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి.  కానీ ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి కిష‌న్ రెడ్డి ఓ క్లారిటీ ఇచ్చారు.   టిక్‌టాక్ యాప్‌ను నిషేధించే ప్ర‌తిపాద‌న ఏదీలేద‌న్నారు.  లోక్‌స‌భ‌లో ఆయ‌న లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు.  టిక్‌టాక్ యాప్ ద్వారా దేశానికి ఇంటెలిజెన్స్ స‌మ‌స్య ఏమైనా ఉందా అని ఓ స‌భ్యుడు ప్ర‌శ్నించారు.  అలాంటి ఆ యాప్‌ను బ్యాన్ చేస్తారా అని అడిగారు. అయితే టిక్‌టాక్ యాప్ గురించి ఎటువంటి అనుమానాస్ప‌ద స‌మాచారం ప్ర‌భుత్వానికి అంద‌లేద‌ని మంత్రి కిష‌న్ రెడ్డి తెలిపారు. యాప్‌ను నిషేధించే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. 

  


logo