గురువారం 02 జూలై 2020
National - Jun 15, 2020 , 15:18:23

మరోసారి లాక్‌డౌన్‌ ఆలోచన లేదు : కేజ్రీవాల్‌

మరోసారి లాక్‌డౌన్‌ ఆలోచన లేదు : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : రానున్న రోజుల్లో ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ఆలోచనేదీ లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం స్పష్టం చేశారు. చాలామంది ప్రజలు ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారన్న ఊహల్లో ఉన్నారని, కానీ అలాంటి ప్రణాళిక లేవీ లేవని ట్విట్టర్‌లో సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.  ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ హాజరై ఢిల్లీతోపాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దవాఖానల్లో పడకల సంఖ్య పెంచాలని కోరినట్లు వెల్లడించారు. 


logo