బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 01:37:36

అవినీతి అధికారులకు నో పాస్‌పోర్ట్‌

అవినీతి అధికారులకు నో పాస్‌పోర్ట్‌

న్యూఢిల్లీ: అవినీతిపరులకు ఇక పాస్‌పో ర్ట్‌ లభించదు. అవినీతి ఆరోపణలపై సస్పెండైన లేదా కోర్టుల్లో అవినీతి, నేర కేసులలో నిందితులుగా ఉన్న కేంద్ర అధికారులకు పాస్‌పోర్ట్‌ జారీపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వాధికారులకు పాస్‌పోర్టు ఇవ్వ డానికి విజిలెన్స్‌ క్లియరెన్స్‌ తప్పనిసరని అన్ని కేంద్ర శాఖలకు జారీ చేసిన ఆదేశాల్లో డీవోపీటీ పేర్కొంది. ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు/ నేర సంబంధ కేసులున్నట్లు విజిలెన్స్‌ నివేదికలో తేలి తే వారి పాస్‌పోర్టును తిరస్కరిస్తారు. విదేశాల్లో విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారులకూ ఇది వర్తిస్తుంది. ఆ అధికారితో విదేశాలతో సంబంధాలకు నష్టం జరుగుతుందని భావించిన పక్షంలో ఆయనకు పాస్‌పోర్టు తిరస్కరిస్తారు.


logo
>>>>>>