ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 18:18:24

నో పరేడ్‌.. కల్చరల్‌ ప్రోగామ్స్‌!

నో పరేడ్‌.. కల్చరల్‌ ప్రోగామ్స్‌!

భోపాల్‌ : కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంలో ఆగస్టు 15న మధ్యప్రదేశ్‌లో పిల్లల పరేడ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రవర్గ సమావేశం జరిగింది. అనంతరం హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా వివరాలను వెల్లడించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం సీఎం శివరాజ్ సింగ్‌ అధ్యక్షతన జరిగిందని, స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ప్రతి జిల్లా, తాలూకలో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనే వారని, కానీ ఈ సారి కొవిడ్‌-19 నేపథ్యంలో సీఎం మంత్రి మండలితో కలిసి భోపాల్‌లోనే ఒకే కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

జిల్లా, తహసీల్‌లో అధికారులు కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఈ సారి పాఠశాలల నుంచి వచ్చే పిల్లల కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రసంగం టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని చెప్పారు. కొవిడ్‌ యోధా కల్యాణ్‌ యోజన’లో అడ్మినిస్ట్రేటివ్ వర్కర్ డ్యూటీలో మృతి చెందినట్లయితే, ఆ వ్యక్తి వెంటనే కుటుంబానికి రూ.50లక్షల సాయం అందించనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 20 మందికి సాయం అందించినట్లు వివరించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo