గురువారం 28 జనవరి 2021
National - Dec 23, 2020 , 17:52:48

బెంగాల్‌ను ఎవ‌రూ ధ్వంసం చేయ‌లేరు: మ‌మ‌తా బెన‌ర్జి

బెంగాల్‌ను ఎవ‌రూ ధ్వంసం చేయ‌లేరు: మ‌మ‌తా బెన‌ర్జి

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి మ‌రోసారి భారతీయ జ‌న‌తాపార్టీపై (బీజేపీపై) విమ‌ర్శ‌లు గుప్పించారు. బెంగాల్‌ను ఎవ‌రూ ధ్వంసం చేయ‌లేర‌ని బీజేపీ నేత‌ల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బుధ‌వారం కోల్‌కతాలో జ‌రిగిన బంగ్లా సంగీత్ మేళా కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మ‌మ‌తా బెన‌ర్జి.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో బీజేపీని ప్ర‌ధానంగా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. 

'మా నేల‌పై మాకు ఎన‌లేని గౌర‌వం ఉంది. మేం మా నేల‌ను కాపాడుకుంటాం. బెంగాల్‌ను ఎవ‌రూ ధ్వంసం చేయ‌లేరు. మేం ఎట్టిప‌రిస్థితుల్లో ప‌శ్చిమ‌బెంగాల్‌ను గుజ‌రాత్ రాష్ట్రంలా మార‌నివ్వం' అని మ‌మ‌తాబెన‌ర్జి వ్యాఖ్యానించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo