సోమవారం 25 జనవరి 2021
National - Dec 24, 2020 , 10:47:11

రాజస్థాన్‌లో న్యూ ఇయర్ వేడుకలకు బ్రేక్‌

రాజస్థాన్‌లో న్యూ ఇయర్ వేడుకలకు బ్రేక్‌

జైపూర్‌ : న్యూ ఇయర్‌ వేడుకలకు రాజస్థాన్‌ ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. డిసెంబర్‌ 31న కర్ఫ్యూ విధించింది. రాత్రి 8గంటల నుంచి జనవరి ఉదయం ఒకటిన 6 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో దాదాపు లక్షకుపైగా జనాభా ఉంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. రాత్రి కర్ఫ్యూ విధించిన ప్రాంతాల్లో రాత్రి 7 గంటలకు మూసివేయాలని ఆదేశించింది. నూతన సంవత్సర సందర్భంగా అన్ని సమావేశాలు, బహిరంగ కార్యక్రమాలపై, పటాకులు కాల్చడంపై కూడా నిషేధం విధించింది. అలాగే ప్రార్థనా స్థలాల్లో కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌ ధరించాలని, శానిటైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా రాజస్థాన్‌లో బుధవారం 992 కరోనా కేసులు నమోదవగా.. ఎనిమిది మంది మరణించారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,01,708కు చేరగా.. 2,87,418 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో 1,736 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 2,642 మంది మృత్యువాతపడ్డారు.


logo