ధారావిలో కరోనా కేసులు నిల్

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో గత 24గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని అధికారులు బుధవారం తెలిపారు. జీరో కేసులు జనవరిలో రెండోసారి అని, నగరంలో కరోనా వ్యాప్తి చెందిన అనంతరం మూడోసారి అని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 22న ఎలాంటి వైరస్ కేసులు నిర్ధారణ కాలేవు. గతేడాది డిసెంబర్ 25న కూడా ఒక్క కేసు సైతం నమోదు కాలేదు. ప్రస్తుతం ధారావిలో కేస్‌లోడ్ 3,911 కు చేరగా.. ఇప్పటి వరకు 3585 మంది కోలుకొని దవాఖానాల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 14 క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఈ మురికివాడలో తొలి కరోనా కేసు గత ఏడాది ఏప్రిల్ 1న నమోదైంది. ముంబైలో ఫస్ట్ కొవిడ్ కేసును గుర్తించిన దాదాపు 20 రోజుల తర్వాత ఇక్కడ ఓ వ్యక్తి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించాడు. 2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారావిలో 6.5లక్షలకుపైగా జనాభా ఉండగా.. ఆసియాలోనే అతిపెద్ద మురికవాడగా నిలిచింది.
తాజావార్తలు
- బ్లాక్ డ్రెస్‌లో రాశీ ఖన్నా గ్లామర్ షో అదిరింది...!
- ‘మోదీ ఫొటోలను తొలగించండి’
- బిల్డింగ్‌పై నుండి కింద పడ్డ నటుడు.. ఆసుపత్రికి తరలింపు
- శ్రీగిరులకు బ్రహ్మోత్సవ శోభ.. నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
- ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ పిక్ లీక్..!
- రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
- ఆశపెట్టి.. దోచేస్తారు
- గేమ్ ఓవర్.. గ్రూప్ డిలీట్
- ఒంటరి మహిళలు.. ఒంటిపై నగలే టార్గెట్
- 04-03-2021 గురువారం.. మీ రాశి ఫలాలు