సోమవారం 25 మే 2020
National - Apr 04, 2020 , 16:31:16

కంప్యూట‌ర్లు, ఫ్యాన్లు, ఏసీలు స్విచ్‌ ఆఫ్ చేయ‌కండి..

కంప్యూట‌ర్లు, ఫ్యాన్లు, ఏసీలు స్విచ్‌ ఆఫ్ చేయ‌కండి..

హైద‌రాబాద్‌: ఇంట్లో లైట్ల‌ను స్విచ్ ఆఫ్ చేసి.. కొవ్వొత్తుల‌ను వెలిగించాల‌ని ప్ర‌ధాని మోదీ పిలుపు ఇచ్చిన విష‌యం తెలిసిందే.  క‌రోనాపై పోరాటం చేసేందుకు మ‌హా సంక‌ల్పాన్ని తీసుకోవాల‌ని, దానిలో భాగంగా ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు లైట్లు స్విచ్ ఆఫ్ చేయాల‌ని ప్ర‌ధాని త‌న వీడియో సందేశంలో కోరారు.  దీనిపై విద్యుత్తురంగ నిపుణులు కొంద‌రు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు.  ఒక్క‌సారిగా దేశ‌మంతా విద్యుత్తు వినియోగాన్ని త‌గ్గిస్తే.. బ్లాక్ అవుట్ ఏర్ప‌డుతుంద‌ని, ప‌వ‌ర్ గ్రిడ్‌లు కాలిపోతాయ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది.  కంప్యూట‌ర్లు, ఫ్యాన్లు, ఏసీల‌ను స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది.  లైట్ల స్థానంలో కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్‌లైట్ లేదా మొబైల్ లైట్ల‌ను ఆన్ చేయాల‌ని మోదీ కోరిన విష‌యం తెలిసిందే.logo