గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 13:20:58

సంతృప్తి కోస‌మే లాక్‌డౌన్‌.. ఢిల్లీలో అవ‌స‌రం లేదు: కేజ్రీవాల్‌

సంతృప్తి కోస‌మే లాక్‌డౌన్‌.. ఢిల్లీలో అవ‌స‌రం లేదు: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ అనేది మ‌న సంతృప్తి కోస‌మేన‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో మ‌రోసారి లాక్‌డౌన్ విధించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఢిల్లీలో క‌రోనా ప‌రిస్థితి మెరుగైంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం కోలుకున్న వారి రేటు 88 శాత‌మ‌ని తెలిపారు. కేవ‌లం 9 శాతం మంది మాత్ర‌మే క‌రోనా రోగులున్నార‌ని కేజ్రీవాల్ అన్నారు. 2-3 శాతం మంది మాత్ర‌మే క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించార‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గుతుంద‌న్నారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు ఢిల్లీ అమ‌లు చేసిన న‌మూనా గురించి ప్ర‌స్తుతం దేశంతోపాటు విదేశాల్లోనూ చ‌ర్చించుకుంటున్నార‌ని తెలిపారు. 

ఢిల్లీ ప్ర‌భుత్వం త్వ‌ర‌లో ఒక జాబ్‌ పోర్ట‌ల్ ప్రారంభిస్తుంద‌ని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఉద్యోగార్ధులు త‌మ వివ‌రాల‌తో న‌మోదు చేసుకోవ‌చ్చ‌న్నారు. రిక్రూట‌ర్లు కూడా త‌మ‌కు కావాల్సిన వ్య‌క్తుల గురించి తెలుసుకుని నిమయ‌మించుకోవ‌చ్చ‌ని వివ‌రించారు. ఈ జాబ్ పోర్ట‌ల్ ఒక ఉద్యోగాల బ‌జార్ మాదిరిగా ఉంటుంద‌ని కేజ్రీవాల్ అన్నారు.logo