బుధవారం 27 మే 2020
National - May 10, 2020 , 16:36:15

మా బేకరీలో ముస్లిం ఉద్యోగులు లేరు

మా బేకరీలో ముస్లిం ఉద్యోగులు లేరు

చెన్నై: మా బేకరీలో ముస్లిం ఉద్యోగులు ఒక్కరు కూడా లేరు, అంతా జైనులే.. అని ప్రకటన తయారుచేసిన చెన్నైకి చెందిన  ఓ బేకరీ యజమానిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సదరు బేకరీ ప్రకటన వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతూ చివరకు పోలీసులకు చేరడంతో బేకరీ యజమానిపై కేసు నమోదైంది. చెన్నైకి చెందిన 32 ఏండ్ల ప్రశాంత్‌ అనే యువకుడు జైన్‌ బేకర్స్‌ పేరిట ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తున్నాడు. తమ వద్ద జైనులు మాత్రమే బేకరీ ఉత్పత్తులు తయారుచేస్తారు, ముస్లిం ఉద్యోగులు అసలే లేరు అని తన బేకరీ ప్రకటనను తనకు తెలిసినవారి వాట్సాప్‌ గ్రూపులో పోస్ట్‌ చేశాడు. ఈ ప్రకటన ఎన్నో గ్రూపుల్లో తిరిగి చివరకు పోలీసులకు చేరింది. ముస్లింల గురించి తప్పుడు అభిప్రాయాలను ఇచ్చినందుకు బేకరీ యజమానిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముస్లింల వద్ద కూరగాయలు, పండ్లు కొనుగోలు చేయవద్దంటూ ఇప్పటికే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సురేశ్‌ తివారీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


logo