సోమవారం 23 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 16:24:39

ఇకపై ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ మద్యం లభించదు

ఇకపై ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ మద్యం లభించదు

న్యూఢిల్లీ : స్థానికంగా తయారైన ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ (సీఎస్డీ) వద్ద ఇకపై విదేశీ మద్యం లభించదు. అన్ని ప్రత్యక్ష దిగుమతి వస్తువులను అమ్మడాన్ని ప్రభుత్వం నిషేధించడంతో ఈ నిర్ణయం అనివార్యమైంది. సీఎస్‌డీ రక్షణ సిబ్బంది కోసం క్యాంటీన్‌లను నిర్వహిస్తుంది. వీటిలో అన్నిరకాల వస్తువులు సబ్సిడీ రేటుకే లభిస్తాయి.

ఇతర దేశాల నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీలు ఇకపై సీఎస్డీ అల్మారాల్లో అందుబాటులో ఉండదు. భారతదేశంలోనే తయారైన మద్యం మాత్రమే క్యాంటీన్లలో అమ్ముతారు. విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని ప్రభుత్వం వేగవంతం చేసిన ఆత్మనిర్భర్ భారత్ తో కదలిక వచ్చింది. ముఖ్యంగా లడఖ్‌లోని వాస్తవాధీన నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వద్ద చైనా దురాక్రమణ నేపథ్యంలో అక్కడి పలు వస్తువులపై కేంద్రం నిషేధం విధించింది. అలాగే ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తెచ్చిన స్వదేశీ వస్తువులను ప్రోత్సహించేలా క్రయవిక్రయాలు జరుగాలని సూచించింది. సీఎస్‌డీ స్టోర్లలో దిగుమతి చేసుకున్న వస్తువులలో ఎక్కువ భాగం చైనా ఉత్పత్తులు.. ఎలక్ట్రిక్ బ్రష్‌లు, ఎలక్ట్రిక్ కెటిల్స్, లేడీస్ బ్యాగ్స్, శాండ్‌విచ్ టోస్టర్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనలైజెస్ ప్రకారం, ఈ క్యాంటీన్లలో విక్రయించిన 5,500 వస్తువులలో 420 దిగుమతి అవుతున్నాయి. ‘ప్రత్యక్ష దిగుమతి’ వస్తువులను సేకరించడం మానేయాలని ఆర్మీ క్యాంటీన్లకు సూచించే ఈ ప్రభుత్వ ఉత్తర్వు స్థానిక ఉత్పత్తులకు తోడ్పడుతుంది. 

దేశవ్యాప్తంగా నడుపుతున్న సైనిక క్యాంటీన్లలో "మేడ్ ఇన్ ఇండియా" ఉత్పత్తులను మాత్రమే విక్రయించడంపై రక్షణ మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ గత నెలలో రాజ్యసభలో చెప్పిన తరువాత శనివారం ఈ చర్య తీసుకున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.