శనివారం 30 మే 2020
National - May 16, 2020 , 15:40:14

వలస కార్మికుల తరలింపునకు ఖర్చంతా భరిస్తాం : మమతా బెనర్జీ

వలస కార్మికుల తరలింపునకు ఖర్చంతా భరిస్తాం : మమతా బెనర్జీ

కోల్‌కతా : ఈ విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులు ఎదుర్కొంటున్న శ్రమ, కష్టానికి పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ వారికి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఓ వార్త తెలిపేందుకు తాను ఎంతో సంతోషిస్తున్నట్లు ఆమె ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ర్టాల్లో చిక్కుకున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన వలస కార్మికులను ప్రత్యేక రైళ్లలో రాష్ర్టానికి తిరిగి తీసుకురానున్నట్లు చెప్పారు. ఇందుకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఏ ఒక్క వలస కార్మికుడి నుంచి నయా పైసా వసూలు చేయమని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ర్టాల్లో చిక్కుకున్న బెంగాల్‌ వలస కార్మికుల తరలింపునకు ప్రత్యేక శ్రామిక రైళ్లను నడపాల్సిందిగా కోరుతూ ఈ మేరకు రైల్వే బోర్డుకు ప్రభుత్వం లేఖను పంపించింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. మృతులకు సంతాపం ప్రకటించింది. మృతిచెందిన ఒక్కో వ్యక్తికి ఎక్స్‌గ్రేషియాగా రూ. 2 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నగదును అతి త్వరలోనే వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు పేర్కొంది.


logo