శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 18, 2020 , 12:07:08

లాక్‌డౌన్ కాదు.. ఆంక్ష‌లు విధిస్తున్నామంతే

లాక్‌డౌన్ కాదు.. ఆంక్ష‌లు విధిస్తున్నామంతే

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రోమారు లాక్‌డౌన్ ఉండ‌ద‌ని, అయితే ర‌ద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆంక్ష‌లు విధిస్తామ‌ని ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ ప్ర‌క‌టించారు. ఢిల్లీలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం నివార‌ణా చ‌ర్య‌లు ప్రారంభించింది. ఇందులో భాగంగా పెద్దఎత్తున క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని, దీనివ‌ల్ల వైర‌స్ వ్యాప్తిని నిలువ‌రించడానికి అకాశం ఉంటుంద‌ని చెప్పారు. ఛాత్ పూజ సంద‌ర్భంగా భారీగా జ‌నాలు గుమికూడ‌టంతో వైర‌స్ సుల‌భంగా వ్యాప్తి చెందుతుంద‌ని, అందువ‌ల్ల ప్ర‌జలు గుమికూడ‌కుండా ఆక్ష‌లు విధిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.   

ఢిల్లీలో మ‌రోమారు లాక్‌డౌని విధిస్తార‌నే ప్ర‌చారాన్ని రెండు రోజుల క్రితం ఆయ‌న కొట్టిపారేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్ స‌రైన చ‌ర్య‌కాద‌ని, దానికంటే ప్ర‌తి ఒక్క‌రూ మాస్కులు ధ‌రించ‌డం ఉత్త‌మ‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఢిల్లీలో కరోనా థ‌ర్డ్ వేవ్ కూడా ఇప్ప‌టికే పీక్ ద‌శ‌ను దాటిపోయింద‌ని, కాబ‌ట్టి ఇప్పుడు మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి స్ప‌ష్టంచేశారు.