బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 13:04:19

డిసెంబ‌ర్ ఒక‌టి నుంచి మ‌ళ్లీ లాక్‌డౌన్‌.. ఇదీ నిజం

డిసెంబ‌ర్ ఒక‌టి నుంచి మ‌ళ్లీ లాక్‌డౌన్‌.. ఇదీ నిజం

హైద‌రాబాద్‌: దేశంలో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో డిసెంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల సోష‌‌ల్ మీడియాలో ఓ పోస్టు వైర‌ల్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది.  దేశంలో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో త‌న ఫ్యాక్ట్ చెక్ ట్వీట్‌లో పేర్కొన్న‌ది. కోవిడ్‌19 మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ఫేక్ న్యూస్ పెరిగింద‌ని, ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో వ‌దంతులు వ్యాపిస్తున్నాయ‌ని,  కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా వెల్ల‌డించేంత వ‌ర‌కు ఎవ‌రూ ఇటువంటి వార్త‌ల‌ను న‌మ్మ‌రాదు అని పీఐబీ త‌న ట్వీట్‌లో చెప్పింది. 2019 డిసెంబ‌ర్‌లో పీఐబీ త‌న ఫ్యాక్ట్ చెక్ వింగ్‌ను లాంచ్ చేసింది. సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వ విధానాల‌పై వ‌చ్చే దుష్ ప్ర‌చారాల‌ను అడ్డుకునేందుకు ఈ శాఖ‌ను ఏర్పాటు చేశారు.  కాలిన గాయాలపై నూనెలు, పౌడర్లు, పేస్టులు రాస్తున్నారా? .. వీడియో )