ఆదివారం 05 జూలై 2020
National - Jun 15, 2020 , 16:44:00

మ‌ళ్లీ లాక్‌డౌన్ ఉండ‌దు: గుజ‌రాత్ సీఎం

మ‌ళ్లీ లాక్‌డౌన్ ఉండ‌దు: గుజ‌రాత్ సీఎం

అహ్మ‌దాబాద్: గుజరాత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండటంతో మళ్లీ కఠిన‌ లాక్‌డౌన్‌ విధించే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌ల‌ను ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ కొట్టిపారేశారు. రాష్ట్రంలో మ‌రోసారి   లాక్‌డౌన్ విధించే ప్రణాళిక ఏదీ తమ ప్రభుత్వం ద‌గ్గ‌ర లేద‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని కూడా రూపానీ తోసిపుచ్చారు.  వాస్తవ విరుద్ధమైన ఇలాంటి ఊహాగానాలను ప్రజలు నమ్మొద్దని కోరారు.

ఇదిలావుంటే, జూన్‌ 1 నుంచి నాన్‌ కంటైన్మెంట్‌ జోన్ల‌లో లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి వ‌స్తున్న‌ద‌ని ఆయన ఓ ప్రటకనలో పేర్కొన్నారు. వ్యాపారం, వాణిజ్య సంబంధ‌ కార్యకలాపాలు సైతం పుంజుకుంటున్నాయని వెల్లడించారు. అయితే, కరోనా మహమ్మారిపై పోరాటం కొనసాగుతుందనీ, ప్రజలు కూడా ఈ వైరస్‌తో కలిసి బతకడం నేర్చుకోవాలని రూపానీ సూచించారు. 


logo