బుధవారం 08 జూలై 2020
National - Jun 25, 2020 , 17:51:04

క‌రోనా విజృంభ‌ణ‌.. పోలీసుల‌కు సెల‌వులు ర‌ద్దు

క‌రోనా విజృంభ‌ణ‌.. పోలీసుల‌కు సెల‌వులు ర‌ద్దు

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఆ రాష్ర్ట పోలీసు యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని ప్ర‌భుత్వం పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో గుజ‌రాత్ పోలీసుల‌కు సెల‌వులు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆ రాష్ర్ట డీజీపీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. సెల‌వుల్లో ఉన్న వారు త‌క్ష‌ణ‌మే విధుల‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించారు. 

ఈ మేర‌కు పోలీసు ఉన్న‌తాధికారుల‌కు, రేంజ్ ఇన్ స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్ కు, జిల్లా ఎస్పీల‌కు.. నోటీసులు ఇచ్చారు. సబార్డినేట్ స్టాఫ్ కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సెల‌వులు ఇవ్వొద్ద‌ని ఆదేశాలు జారీ చేశారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు, మెడిక‌ల్ కు సంబ‌ధించి మాత్ర‌మే సెల‌వు ఇవ్వాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. 

దేశంలో పాజిటివ్ కేసుల్లో గుజ‌రాత్ నాలుగో స్థానంలో ఉంది. గుజ‌రాత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 29,001 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 1,736 మంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మ‌దాబాద్ లో అత్య‌ధికంగా 19,601, సూర‌త్ లో 3,712, వ‌డోద‌ర‌లో 1,985, గాంధీన‌గ‌ర్ లో 587, మోహ‌సానాలో 224 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. logo