బుధవారం 08 జూలై 2020
National - Jun 19, 2020 , 13:34:50

అఖిల‌ప‌క్ష భేటీ కోసం ఆర్జేడీకీ అంద‌ని ఆహ్వానం

అఖిల‌ప‌క్ష భేటీ కోసం ఆర్జేడీకీ అంద‌ని ఆహ్వానం

న్యూఢిల్లీ: ల‌ఢ‌ఖ్‌లోని గ‌ల్వాన్ న‌దీ లోయ ప్రాంతంలో భార‌త్-చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది. అయితే ఈ స‌మావేశానికి రావాలంటూ  దేశంలోని 20 ప్ర‌ధాన పార్టీల‌ను ఆహ్వానించిన కేంద్రం.. బీహార్‌లోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన ఆర్జేడీకి మాత్రం ఆహ్వానం పంప‌లేదు. ప్ర‌ధాని త‌ర‌ఫున అన్ని పార్టీల నేత‌ల‌కు ఫోన్ చేసి అఖిల‌ప‌క్షానికి ఆహ్వానించిన ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆర్జేడీ నేత‌ల‌కు మాత్రం ఫోన్ చేయ‌లేదు. 

దీంతో కేంద్రం తీరుపై ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీహార్‌లో త‌మది అతిపెద్ద పార్టీ అని, పార్ల‌మెంటులో త‌మ‌కు ఐదుగురు ఎంపీలు ఉన్నార‌ని, అయినా త‌మ‌ను అఖిల‌ప‌క్ష స‌మావేశానికి ఆహ్వానించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిట‌ని తేజ‌స్వి ప్ర‌శ్నించారు. త‌మ‌ను అఖిల‌ప‌క్షానికి ఆహ్వానించ‌క‌పోవ‌డంపై ర‌క్ష‌ణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.                      logo