శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 16:57:09

అయోధ్య సందర్శనకు ఆహ్వానం అవసరం లేదు: శివసేన

అయోధ్య సందర్శనకు ఆహ్వానం అవసరం లేదు: శివసేన

ముంబై: అయోధ్య సందర్శనకు తమకు ఎలాంటి ఆహ్వానం అవసరం లేదని శివసేన తెలిపింది. మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే అయోధ్యను సందర్శించారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఈ సందర్భంగా రామాలయ నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అయోధ్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన శివసేన రామాలయం నిర్మాణానికి ఉన్న అన్ని అవరోధాలను తొలగించిందని సంజయ్ రౌత్ చెప్పారు. ఈ నేపథ్యంలో అయోధ్య సందర్శన కోసం తమ పార్టీకి ప్రత్యేక ఆహ్వానం అవసరం లేదన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేనకు కూడా ఆహ్వానం పంపినట్లు వస్తున్న వార్తలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ మేరకు స్పందించారు.

logo