బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 13:58:18

శివసేనతో చేతులు కలిపే ఉద్దేశం లేదు : ఫడ్నవిస్‌

శివసేనతో చేతులు కలిపే ఉద్దేశం లేదు : ఫడ్నవిస్‌

ముంబై : శివసేనతో చేతులు కలిపే ఉద్దేశం తమకు లేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌ అన్నారు. సోమవారం ముంబైలో విలేకరులతో ఆయన మాట్లాడారు. శివసేన నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. స్వయంకృత అపరాధ చర్యలతో శివసేన ప్రభుత్వం కూలిపోబోతోందని జోస్యం చెప్పారు. అతితొందరలోనే ఇది జరగబోతోందని, దీనిని మనందరం చూస్తామని ఆయన పేర్కొన్నారు. శివసేన ప్రభుత్వంలో చేరే ఆలోచనే తమకు లేదని, ప్రభుత్వాన్ని గద్దె దించాలని కుట్ర చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలోను నిజం లేదని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo